ఎసిబికి పట్టుబడిన ఆర్మూరు మున్సిపల్ కమిషనర్..

ఎసిబికి పట్టుబడిన ఆర్మూరు మున్సిపల్ కమిషనర్..
X

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి చేప చిక్కింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అస్తి పన్నుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి 20 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కమిషనర్ రాజును నిజామాబాద్ ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కమిసనర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలోనే కాదు దేశంలో నిత్యం అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు.

Tags

Next Story