సూర్యాపేటలో ప్రమాదం: ప్రభుత్వ టీచర్ మృతి.. చంపాపేటలో కారుతో ఢీకొట్టి... వంద మీటర్లు లాక్కెళ్లాడు

సూర్యాపేటలో ప్రమాదం: ప్రభుత్వ టీచర్ మృతి.. చంపాపేటలో కారుతో ఢీకొట్టి... వంద మీటర్లు లాక్కెళ్లాడు
X

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి దగ్గర కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందగా మరో నలుగురు టీచర్ల్లు గాయపడ్డారు. రావులపల్లి హెడ్మాస్టర్, మరొక హెడ్మాస్టర్ తులసీలు తీవ్రంగా గాయపడడంతో 108లో సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసునలు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ నుంచి కారులో పాఠశాలకు వెళ్తుండగా కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ లోని చంపాపేట్లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. సునీల్ కుమార్ అనే యువకుడిని కారు ఢీకొట్టింది. అనంతరం యువకుడిని కారు వంద మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సునీల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Next Story