పరిణితి లేకుండా అతడి బౌలింగ్ సాగింది: అశ్విన్

ఆసియాకప్‌లో భాగంగా జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ ఓవర్‌లో లంకపై భారత్ నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కించుకున్న హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లలో ఒకేఒక్క వికెట్ తీసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. దీంతో అతని బౌలింగ్‌పై టీం ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ టెక్నిక్ సరిగ్గా లేదని అశ్విన్ అన్నాడు.
‘‘హర్షిత్‌కి కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. ఇలా జట్టులోకి వస్తూ.. పోతూ ఉండటం వల్ల ఆత్మ విశ్వాసం దెబ్బ తినే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఒక బంతి వేగంగా.. మరో బంతి నెమ్మదిగా వేశాడు. పరిణితి లేకుండా హర్షిత్ బౌలింగ్ సాగింది. ఈ తప్పుల నుంచి అతడు కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని అశ్విన్ చురకలంటించాడు.
-
Home
-
Menu