విద్యార్థినిని గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

X
ఎపిలోని తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ప్రొఫెసర్ లక్ష్మణ్ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరిచిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వేధింపులు తాళలేక బాధిత విద్యార్థిని యూనివర్శిటీ విసికి ఫిర్యాదు చేసి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను విసి సస్పెండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో లక్ష్మణ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా బాధిత విద్యార్థినిని ఫిర్యాదు చేయమని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్లిపోయింది.
Next Story
-
Home
-
Menu
