పెట్రోలు పోసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

పెట్రోలు పోసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య
X

సూర్యాపేట: అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోట్యాతండాలో భూక్యా లచ్చు(65), భూక్యా వీరమ్మ(60) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుకలు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. గత కాలంగా దంపతులు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. పిల్లలకు బారం కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. గది లోపల గడియ పెట్టుకొని వృద్ధ దంపతులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. గదిలో నుంచి పొగలు, కేకలు వినిపించడంతో తండా వాసులు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీరమ్మ అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. లచ్చు మాత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. చిన్న కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story