ఆత్మకూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువకులు మృతి

Atmakur Yadadri Bhuvanagiri
X

Atmakur Yadadri Bhuvanagiri

ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)లో రోడ్డు ప్రమాదం జరిగింది. నరసాపురం గ్రామ శివారులో ఆదివారం ఉదయం లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన బోళ్ల బన్నీ, దత్తప్పగూడెనాకి చెందిన కుక్కల సాయిగా గుర్తించారు. బోళ్ల బన్నీ తన స్నేహితుడు సాయితో కలిసి హైదరాబాద్ లో కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Tags

Next Story