చంద్రబాబు బెదిరింపులతోనే వైసిపి కార్యకర్తలపై దాడి: జగన్

Attack on YCP activists due to Chandrababus threats: Jagan
X

Attack on YCP activists due to Chandrababu's threats: Jagan

అమరావతి: డిఎస్సీ స్కాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు అడ్డంగా దొరికరాని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. తాడేపల్లిలో వైసిపి పార్టీ నాయకులతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. వైయస్ఆర్ సిపి శాంతియుత ర్యాలీలపై టిడీపి గుండాల దాడి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడారు.సిఎం చంద్రబాబు ,లోకేశ్ కు కొంత మంది పోలీసులు కొమ్ముకాస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ దాడి ఘటనను వైసిపి సీరియస్ గా తీసుకుంటుందని జగన్ తెలియజేశారు. వైయస్ఆర్ సిపి నేతలపై టిడీపి గుండాల దాడి వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని, డిఎస్ సి స్కామ్ గురించి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని జగన్ దుయ్యబట్టారు. డైవర్ట్ చేయడానికి చంద్రబాబు,లోకేష్ గుండాలను దింపారన్నారు. కూటమి స్కామ్ లను బయటపెడుతుంటే దాడులు చేస్తున్నారని, దాడులకు చంద్రబాబు కుప్పంలోనే కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం సభలో చంద్రబాబు చేసిన బెదిరింపులే దీనికి సాక్ష్యమని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీదళాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, ఇది యువగళం టీమ్ కాదు రౌడీ దళం అని మండిపడ్డారు. బాబు అవినీతిని ప్రశ్నించే చోట రౌడీదళాన్ని దించుతున్నారని,రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ కన్నా ఘోరంగా తయారుచేశారని జగన్ ధ్వజమెత్తారు.

Tags

Next Story