టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్ దూరం

త్వరలో ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ టీ20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు. ఈ టోర్నమెంట్ కోసం తమ తాత్కాలిక జట్టును ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిందనే విషయం తెలిసిందే. శనివారం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల తుది జట్టులో కమిన్స్ తోపాటు తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌కు చోటు దక్కలేదు.
ఇక, సీనియర్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ను కూడా పక్కనపెట్టారు. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను తీసుకున్నారు. మాట్ షార్ట్ స్థానంలో మాట్ రెన్‌షాను ఎంపిక చేశారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 17న టోర్నీ ప్రారంభమవుతుంది.
ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
-
Home
-
Menu
