ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

X
కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో టైర్ పేలి పల్టీలు కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కీసర నుండి షామీర్పేట్ వైపు కూలీ లతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం వెనుక టైర్ పేలడంతో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 11 మందికి స్వల్ప గాయలయ్యాయి. మృతులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
