సైలెంట్‌గా ఒటిటిలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా

Awarapan 2
X

కొన్ని సినిమాలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సూపర్ హిట్‌గా నిలుస్తాయి. అలా వచ్చిన సినిమానే ఇమ్రాన్ హష్మి హీరోగా నటించిన ‘ఆవారాపన్-2’. 2007లో వచ్చిన ‘ఆవారాపన్’ సినిమాకి ఇది సీక్వెల్. మొదటి భాగం సినిమాని ప్రేక్షకులు థియేటర్లలో అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత టివిల్లో చూసి సినిమాని ఇష్టపడ్డారు. దీంతో ఆ సినిమా సీక్వెల్‌పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అనుకున్నట్లుగానే ‘ఆవారాపన్-2’ గత నెల 14న థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.213 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సైలెంట్‌గా ఒటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్‌లోకి రావచ్చు. హిందీలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

Tags

Next Story