యాదాద్రి ఆలయానికి మరో అవార్డు

X
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి మరో అవార్డు దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి మరో అవార్డు దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన తొలి పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట ఆలయం నిలిచింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా ఆలయ ఇన్‌ఛారి ఇఒ జి.రవి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎఇఒలు జూశెట్టి కృష్ణ, గజవెల్లి రఘు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ టూరిజం శాఖకు ఇఒ, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story
-
Home
-
Menu