వినాయకుడి లడ్డూకు రికార్డు ధరలు

వినాయకుడి లడ్డూకు రికార్డు ధరలు
X

వినాయకుడి లడ్డూలు రికార్డు ధరలు పలికాయి. నిమజ్జనం సందర్బంగా శుక్రవారం పలుప్రాంతాల్లో నిర్వహించిన వేలంపాటల్లో లడ్డూ కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. కొందరు ఎలాగైనా సొంతం చేసుకోవాలని పోటీపడి దక్కించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో గతేడాది కంటే ఎక్కువ ధరలు పలకగా...మరికొన్ని ప్రాంతాల్లో గతేడాదికంటే చాలా తక్కువ ధరలు పలకడం విశేషం. బాలాపూర్ వినాయకుడి లడ్డూ రూ.39 లక్షలకు అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్‌రెడ్డి దక్కించుకున్నారు. గతయేడాది కంటే రూ.4 లక్షల అధికంగా పలికింది. అత్తాపూర్‌లో గుమ్మడి భూపాల్‌రెడ్డి రూ.13.21 లక్షలకు,

కొంపల్లిలోని అపర్ణ సెరినిటీలో రూ.13లక్షలకు కోల అనిల్‌రెడ్డి, బడంగ్‌పేట్‌లో ఆర్‌విఆర్ సంస్థ రూ.12.40 లక్షలకు,చింతల్‌బస్తీ వీర్‌నగర్‌లో రూ.10.10 లక్షలకు అరుణ్‌కుమార్, గండిపేట్ మండలం ఖానాపూర్‌లో రూ.10.20 లక్షలకు శ్రీశైలం ముదిరాజ్,షాపూర్‌నగర్‌లో రూ.7లక్షలకు ఆంజనేయులు దంపతులు లడ్డూలను వేలంపాటలో దక్కించుకున్నారు. కాగా, బండ్లగూడ జాగీర్ పరిధిలోని రిచ్‌మండ్ విల్లా కమ్యూనిటీలో రూ.1.01 కోట్లకు కమ్యూనిటీ సభ్యులు దక్కించుకున్నారు. ఇదే కమ్యూనిటీలో లడ్డూ ధర గతేడాది రూ.2.31 కోట్లు పలకగా, ఈ యేడాది రూ.1.01 కోట్లు మాత్రమే పలకడం విశేషం.

Tags

Next Story