బాలాపూర్ లడ్డూ వేలం పాట... 8 మంది భక్తుల పేర్లు నమోదు

Balapur Laddu auction
మన తెలంగాణ/గండిపేట్/బాలాపూర్: ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించే వేలం పాట బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తులు ఈ లడ్డూను గణపతి ఆశీస్సులకు ప్రతీకగా భావించి వేలంలో పాల్గొంటారు. బాలాపూర్ వినాయకుడి లడ్డుకు ఎంతటి ప్రాధాన్యత, క్రేజీ ఉన్న విషయం తెలిసిందే. వేలు.. లక్షలు, కోట్లు ధరలు పెట్టి గణనాధుడి లడ్డూలను కైవసం చేసుకుంటారు. 1994లో కేవలం రూ. 450తో ప్రారంభమైన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం, మూడు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో రికార్డులను సృష్టిస్తూ 2025 నాటికి రూ. 35 లక్షలకు చేరుకుంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట పాడేందుకు కొందరు ప్లేరు నమోదు చేసుకున్నారు. సాహెబ్ నగర్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, చంపాపేట్ కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, చంపా పేట్ కు చెందిన కెవిఆర్ ఫ్లవర్ మర్చంట్ కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, హస్తినా పురంకు చెందిన కంచర్ల శివారెడ్డి, లండన్ నుంచి ద సుశి ఆండ్ కో నుంచి సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి, హస్తినా పురం కు చెందిన జిఎర్ఆర్ డెవెలపర్స్ నుంచి గడ్డం నవీన్ రెడ్డి, బాలాపూర్ నుంచి ఇబ్రాం ప్రత్యూష్ లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి ఐదువేలు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు.
బాలాపూర్‌లో రూ.35లక్షలు
గత సంవత్సరం బాలాపూర్ వినాయకుడి లడ్డుకు రికార్డుస్థాయి ధర పలికింది. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో కర్మన్‌ఘాట్‌కు చెందిన స్టీల్‌వ్యాపారి, బిజెపి నేత లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. బండ్లగూడ జాగీరులో రికార్డు స్థాయిలో రూ.2.32 కోట్లు పలకగా, బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. కాగా, కొత్తపేట్‌లో ఓ విద్యార్థి అనూహ్యంగా కేవలం రూ.99కే దక్కించుకోవడం విశేషం.
బాలాపూర్ లడ్డూ వేలం పాట వివరాలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు:
1994 – రూ. 450
1995 – రూ 4,500
1996 – రూ.18,000
1997 – రూ. 28,000
1998 – రూ. 51,000
1999 – రూ.65,000
2000 – రూ.66,000
2001 – రూ.85,000
2002 – రూ.1.05 లక్షలు
2003 – రూ.1.55 లక్షలు
2004 – రూ.2.01 లక్షలు
2005 – రూ.2.08 లక్షలు
2006 – రూ.3 లక్షలు
2007 – రూ.4.15 లక్షలు
2008 – రూ.5.07 లక్షలు
2009 – రూ.5.10 లక్షలు
2010 – రూ.5.35 లక్షలు
2011 – రూ.5.45 లక్షలు
2012 – రూ.7.50 లక్షలు
2013 – రూ.9.26 లక్షలు
2014 – రూ.9.50 లక్షలు
2015 – రూ.10.32 లక్షలు
2016 – రూ.14.65 లక్షలు
2017 – రూ.15.60 లక్షలు
2018 – రూ.16.60 లక్షలు
2019 – రూ.17.60 లక్షలు
2020 – కోవిడ్ కారణంగా వేలం నిర్వహించలేదు
2021 – రూ.18.90 లక్షలు
2022 – రూ.24.60 లక్షలు
2023 – రూ.27 లక్షలు
2024 – రూ.30.01 లక్షలు
2025 – రూ.35 లక్షలు 🏆
Tags
-
Home
-
Menu
