బాలాపూర్ లడ్డూ @ రూ.39 లక్షలు

హైదరాబాద్: బాలాపూర్ గణేషుడి లడ్డూ రికార్డు ధర ఫలికింది. గత సంవత్సరం కంటే నాలుగు లక్షల రూపాయలకు ఎక్కువ ధరకు దక్కించుకున్నారు. సాహెబ్‌నగర్‌కు చెందిన సామా ప్రణీత్ రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డూను రూ.39 లక్షలకు కైవసం చేసుకున్నాడు. అర్బన్ గ్రూప్ సంస్థ అధినేత సామ ప్రణీత్ రెడ్డి అని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించే వేలం పాట బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలాపూర్ వినాయకుడి లడ్డుకు ఎంతటి ప్రాధాన్యత, క్రేజీ ఉన్న విషయం తెలిసిందే. వేలు.. లక్షలు, కోట్లు ధరలు పెట్టి గణనాధుడి లడ్డూలను కైవసం చేసుకుంటారు.
గత సంవత్సరం బాలాపూర్ వినాయకుడి లడ్లూ రూ.35 లక్షలు ధర పలికిన విషయం తెలిసిందే. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో కర్మన్‌ఘాట్‌కు చెందిన స్టీల్‌వ్యాపారి, బిజెపి నేత లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. బండ్లగూడ జాగీరులో రికార్డు స్థాయిలో రూ.2.32 కోట్లు పలకగా, బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్న విషయం విధితమే.
బాలాపూర్ లడ్డూ వేలం పాట వివరాలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు:
1994 – రూ. 450
1995 – రూ 4,500
1996 – రూ.18,000
1997 – రూ. 28,000
1998 – రూ. 51,000
1999 – రూ.65,000
2000 – రూ.66,000
2001 – రూ.85,000
2002 – రూ.1.05 లక్షలు
2003 – రూ.1.55 లక్షలు
2004 – రూ.2.01 లక్షలు
2005 – రూ.2.08 లక్షలు
2006 – రూ.3 లక్షలు
2007 – రూ.4.15 లక్షలు
2008 – రూ.5.07 లక్షలు
2009 – రూ.5.10 లక్షలు
2010 – రూ.5.35 లక్షలు
2011 – రూ.5.45 లక్షలు
2012 – రూ.7.50 లక్షలు
2013 – రూ.9.26 లక్షలు
2014 – రూ.9.50 లక్షలు
2015 – రూ.10.32 లక్షలు
2016 – రూ.14.65 లక్షలు
2017 – రూ.15.60 లక్షలు
2018 – రూ.16.60 లక్షలు
2019 – రూ.17.60 లక్షలు
2020 – కోవిడ్ కారణంగా వేలం నిర్వహించలేదు
2021 – రూ.18.90 లక్షలు
2022 – రూ.24.60 లక్షలు
2023 – రూ.27 లక్షలు
2024 – రూ.30.01 లక్షలు
2025 – రూ.35 లక్షలు
2026- రూ.39 లక్షలు
Tags
-
Home
-
Menu
