జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికలలో చైర్మెన్ ఎన్నిక విషయంలో నెలకొన్న దాడుల నేపద్యంలో జైలుకు వెళ్లిన పెద్దపల్లి మాజీ ఎంపి, చెన్నూర్ మాజీ ఎంఎల్‌ఎ మాజీ విఫ్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, చెన్నూర్ నాయకులు మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ లు 14 రోజుల రిమాండ్ తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి వారు విడుదల అయ్యారు. బాల్క సుమన్ కు బెయిల్ వచ్చిన నేపధ్యంలో మంచిర్యాల జిల్లా నుండి బిఆర్‌ఎస్ శ్రేణులు బుదవారం ఉదయమే ఆదిలాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా జైలు నుండి విడుదలైన వారిని బిఆర్‌ఎస్ శ్రేణులు శాలువలతో సత్కరించి, గజమాలలు వేసి జైలు గేటు వద్ద నుండి బుజాలపై ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకుని ఊరేగించారు.
రాజీకీయలలో ప్రతిపక్ష ప్రత్యర్థులుగా చూశామే కానీ వ్యక్తిగత శత్రువులుగా చూడలేదని మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అన్నారు. జైలు నుండి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవెంత్ రెడ్డి, చెన్నూర్ ఎంఎల్‌ఎ, మంత్రి గడ్డం వివేకానంద కండ్లు చల్లబడ్డాయా, కక్ష తీరాందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను విస్మరించి వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ క్యాతన్‌పల్లి లో తమపై రాళ్లదాడి చేసిందని, పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, తిరిగి సూమారు 25 మంది పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. తనను జైలులో పెట్టించివా వారికి కక్ష తీరినట్లు లేదని, మళ్లీ జైలుకు పంపించాలని కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ మొదలు, మందమర్రి తహాసిల్దార్, డిసిపి, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ లు కూడా ప్రభుత్వ శాఖలో పని చేయడం లేదని, మంత్రి విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా వ్యవహరిస్తున్నారన్నారు. తాము ఎప్పుడు రాజకీయంగానే ఎదుర్కొన్నామని, కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని.పదేళ్లు అధికారంలో ఉన్నా ఎవరిని జైలుకు పంపలేదన్నారు. మంత్రి వివేకానంద కోల్‌బెల్టును రావణకాష్టం చేస్తున్నారని విమర్శించారు.
తాను 2014 లో పెద్దపల్లి ఎంపిగా పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా గడ్డం వివేకానంద పోటీ చేసి ఓడిపోయారని, ఆయనను బిఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రభుత్వంలో సలహాదారుడిగా నియమించారన్నారు. తాను 2018 లో చెన్నూర్ ఎంఎల్‌ఎ గా పోటీ చేయగా తనపై కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్లకుంట వెంకటేష్ నేత ఓడిపోతే, ఆయనను అక్కు న చేర్చుకుని 2019 లో టిఆర్‌ఎస్ పెద్దపల్లి ఎంపిగా నిలబెట్టి గెలిపించుకున్నామని అన్నారు. తాము కలుపుకు పోయే పనులు చేశామే తప్ప కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. నేడు ముఖ్యమంత్రి రేవెంత్‌రెడ్డి, మంత్రి వివేకానంద కక్ష కట్టి తనను జైలుకు పంపించడంతో పాటు బెయిల్ రాకుండా కుతాంత్రాలు చేశారని విమర్శించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటి విషయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికైనా గౌరవించాలని ఆయన సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి జోగురామన్న, మంచిర్యాల జిల్లా బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu
