ఆదిలాబాద్ జైలు నుంచి బాల్కసుమన్ విడుదల

చెన్నూరు: ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బిఆర్ఎస్ నాయకులు విడుదలయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో బాల్కసుమన్ 14 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ, రాళ్లదాడి, మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి ఘటనల్లో సుమన్‌కు చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్యాయ్‌పై దాడి కేసులో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో కానిస్టేబుల్ గాయపడగా దేవాపూర్ ఎస్‌ఐ గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్క సుమన్‌కు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగిన విషయం విధితమే.
-
Home
-
Menu
