క్యాతన్ పల్లిలో కొనసాగుతున్న బంద్

Bandh continues in Kyathanpally
X

Bandh continues in Kyathanpally

క్యాతన్ పల్లి: మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో బంద్ కొనసాగుతుంది. బిఆర్ఎస్, సిపిఐ బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌లో పాల్గొన్నారు. బిఆర్ఎస్ బంద్‌తో క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్నటి రాళ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అరెస్టు పర్వం కొనసాగుతుంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణలతో క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. రెండు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Tags

Next Story