కెసిఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము సిఎంకు లేదు: బండి సంజయ్

ఈ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్‌చేసే దమ్ములేదన్నారు. చేతగాదు, చేసే ఆలోచనే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంప్రమైజ్ పొలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని , అసలు రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదని, డ్రోన్ ఎగరేశారని అరెస్ట్ చేసి బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా చేసినా... వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదంటే.. ఆయనకు చేతగావడం లేదని.. మా రక్తం మరుగుతోందన్నారు. మా కార్యకర్తలపై అడుగడుగునా లాఠీఛార్జ్ చేసి కేసులు పెట్టిన వేధించిన దృశ్యాలు కళ్లముందు ఇంకా కనిపిస్తున్నాయన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్కో లాఠీ దెబ్బకు ఒక్కో గుణపాఠం చెప్పేవాళ్లమన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ భద్రత కోసమేనని చెప్పడానికి సిగ్గు లేదా? మావోయిస్టు జాబితాలో రేవంత్ రెడ్డితోపాటు నా పేరు, జడ్జీల పేర్లు పెట్టారు. మీ అక్రమ దందా కోసం సినిమా నటులను, వ్యాపారుల,
రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు పెడతారా? దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసి, సిగ్గులేకుండా దేశ భద్రత అని తప్పించుకోవాలని చూస్తున్నారా? కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వాంగ్మూలంగా భావించి పూర్తిస్థాయి విచార ణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము రేవంత్‌రెడ్డి సర్కార్‌కు లేదని పదేపదే వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ సీఎంను పట్టుకుని ఎడమ చేతి చెప్పుతో కొట్టాలని ఉందని అంటున్నా.. కాంగ్రెసోళ్లకు పౌరుషం లేదని, అధికారం ఉంది కదా అని కోట్లు దండుకోవడంపై దృష్టి పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం మాకు చేతకాదు, అసమర్ధులం, చేవ చచ్చినోళ్లమని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే అప్పుడు కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధమని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.
-
Home
-
Menu
