బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

X
బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కళాశాల ఉపకులపతిని సంప్రదించేందుకు ప్రతినిధులు ప్రయత్నించినప్పటికి ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వార్త ప్రతినిధులను లోపలికి ఆనుమతించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన ఆర్. వసంతగా మృతురాలిని గుర్తించినట్లు తెలిసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల బాసర విద్యాసంస్థలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులో ఆందోళన నెలకొంది.
Next Story
-
Home
-
Menu
