వేయి స్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబురాలు

వేయి స్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబురాలు
X

వేయి స్తంభాల రుద్రేశ్వర స్వామి దేవాలయంలో శనివారం బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. 50 ఏళ్లుగా ఆలయ ప్రాంగణంలో కులమతాలకు అతీతంగా మహిళలు బతుకమ్మ నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది వేలాది మంది మహిళలు సంప్రదాయ దుస్తులు,ఆభరణాలు ధరించి.. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతో పేర్చిన బతుకమ్మలతో పాల్గొన్నారు. జానపద గీతాలు, కోలాటాలు, విద్యుత్తు దీపాలతో ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది. నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేశాయి.

రాదేశ్యాం సాహితీ సంస్థ ఆధ్వర్యంలో పదేళ్లుగా నిర్వహిస్తున్న పాటల పోటీల్లో పంచనేని సుమ, కట్టా సౌజన్య, అంబటి గాయత్రి వరుసగా ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులు సాధించారు. హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమ విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థ గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ నేతృత్వంలో పోటీలు జరిగాయి. ఇతర ప్రతిభావంతులకు కన్సోలేషన్ బహుమతులు ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ధరణికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంచినీరు, ప్రసాదం అందించారు.

Tags

Next Story