ఎసిబికి చిక్కిన బజార్హత్నూర్ ఎస్ఐ

ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ఇన్స్పెక్టర్ గోకుల రమేశ్ రూ.40 వేల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ఆత్మహత్య కేసులో ఫిర్యాదుదారుడిని నిందితుడిగా చేర్చకుండా ఉండటంతో పాటు, పోలీసుల వద్ద ఉంచిన అతని మొబైల్ ఫోన్‌ను తిరిగి అప్పగించేందుకు ఎస్సై రమేశ్ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో ఫిర్యాదుదారుడి నుంచి ఎస్సై
రూ.40 వేలు తీసుకుంటుండగా అధికారులు బుధవారం రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్సైని అరెస్ట్ చేసి, కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట మాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నదని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
-
Home
-
Menu
