రో-కోలకు ఝలక్ ఇచ్చిన బిసిసిఐ.. ఎంత పని చేసిందంటే..?

టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టుకు ఎన్నో సేవలు అందించారు. కెప్టెన్‌లుగా, సాధారణ ప్లేయర్లుగా ఎన్నో మరపురాని విజయాలు సాధించారు. అందుకే వీరిద్దరికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే టెస్ట్‌లు, టి-20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రో-కోలు.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నారు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను అందుకోవాలని ఇరువురు ఆశపడుతున్నారు. అయితే తాజాగా బిసిసిఐ ఈ జోడీకి ఊహించని ఝలక్ ఇచ్చిందని సమాచారం. వీరిద్దరిని బిసిసిఐ వార్షిక కాంట్రాక్టుల జాబితాలో డీమోట్ చేసినట్లు పలు ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.
గతంలో వీరిద్దరు గ్రేడ్-ఎ+లో ఉండేవారు. అయితే తాజాగా వాళ్లను డీమోట్ చేసి గ్రేడ్-బిలోకి మార్చినట్లు తెలుస్తోంది. టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గ్రేడ్-బిలో ఉండటం గమనార్హం. గ్రేడ్-ఎలో శుభ్‌మాన్ గిల్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేడ్-ఎ+ కేటగిరిని పూర్తిగా తొలగించారట. విరాట్, రోహిత్‌లో గ్రేడ్-ఎ+లో ఉన్నప్పుడు బిసిసిఐ వీరికి ఏడాదికి రూ.7 కోట్లు చెల్లించేది. ఇప్పుడు ఈ కొత్త విధానంలో మార్పులు, చెల్లింపులు ఎలా ఉంటాయనేది ఇంకా తెలియరాలేదు. ఇక గ్రేడ్-ఎలో ఉన్న ఆటగాళ్లు రూ.5 కోట్లు, గ్రేడ్-బిలో ఉన్న వాళ్లు రూ.3 కోట్లు, గ్రేడ్-సిలో ఉన్నవాళ్లు రూ.1 కోటి అందుకుంటారు.
వార్షిక కాంట్రాక్ట్ ఆటగాళ్లలో తాజా మార్పులు..
గ్రేడ్-ఎ: శుభ్‌మాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
గ్రేడ్-బి: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.
గ్రేడ్-సి: అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకు సింగ్, శివబ్ దూబే, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.
-
Home
-
Menu
