తంగేడు పువ్వుల కోసం వెళ్లిన వ్యక్తికి తీవ్రగాయాలు.... ఎందుకో తెలిస్తే షాక్

X
రాజన్న సిరిసిల్ల: బతుకమ్మ పండుగ సందర్భంగా ఓ వ్యక్తి తంగెడు పూల కోసం గ్రామ శివారులోకి వెళ్లగా అతడిపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... సద్దుల బతుకమ్మ పండుక కోసం వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తి తంగేడు పువ్వుల కోసం రుద్రంగి గ్రామ శివారులోని గుట్టకు వెళ్లాడు. తంగెడు పువ్వులు తెంపుకుంటూ ముందుకు కదులుతున్నాడు. చెట్ల పొదల్లో ఉన్న ఎలుగుబండి ఒక్కసారిగా లక్ష్మణ్ పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడు కేకలు వేయడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో రైతులు తమ పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
