రవితేజ మూవీ నుంచి ‘బెల్లా బెల్లా’ వీడియో సాంగ్ రిలీజ్

Bella Bella Song
X

మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. డింపుల్ హయాతి, అషిక రంగనాథ్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా నుంచి ‘బెల్లా బెల్లా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా పాట అభిమానులను అలరిస్తోంది.

ఈ పాటకి సురేశ్ గంగుల లిరిక్స్ అందించగా.. నకాశ్ అజీజ్, రోహిని అలపించారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.



Tags

Next Story