బెట్టింగ్ యాప్ కేసు.. ముగిసిన రానా విచారణ

బెట్టింగ్ యాప్ కేసు.. ముగిసిన రానా విచారణ
X

ఆన్ లైన్ బెట్టింగ్‌ యాప్ కేసులో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాను సిఐడి అధికారులు విచారించారు. శనివారం సిఐడి కార్యాలయానికి వచ్చిన రానాను సిఐడి అధికారులు గంటన్నర పాటు ప్రశ్నించారు. బెట్టింగ్‌ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్‌పై సిఐడి అధికారులు రానాను విచారించినట్లు సమాచారం. రానా బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో రానాతోపాటు ఇవాళ టెలివిజన్ యాంకర్ విష్ణుప్రియను కూడా సిఐడి అధికారులు విచారించారు. కాగా, 2017లో బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లను రానా ప్రమోట్‌ చేశారు. ఈ కేసులో రానాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలతోపాటు పలువురు క్రికెటర్లనూ ఈడీ అధికారులు విచారించారు.

Next Story