భద్రాద్రిలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టుర‌ట్టు

భద్రాద్రిలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టుర‌ట్టు
X

భద్రాద్రి కొత్తగూడెం: భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టుర‌ట్టు జరిగిన సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. భ‌క్తులు స్వామివారికి సమర్పించే వస్త్రాల అమ్మ‌కాల్లో గోలుమాల్‌ జరిగింది. వ‌స్త్ర దుకాణాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను భక్తులకు అమ్మవారి చీరలు అని చెప్పి కొందరు అమ్ముతున్నారు. భ‌ద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ రావు ప‌ట్టుకున్నారు. సాధారణంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను తిరిగి కొనుగోలు చేసే విధానం ఒకటి ఉంటుంది. ఈ వ్యవస్థను బ్రష్టు పట్టించడమే కాకుండా మార్కెట్‌లోని దుకాణాల నుంచి కొనుగోలు చేసి బట్టలను భక్తులకు అమ్మేందుకు కొందరు సిద్ధం చేయడంతో వారిని అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన వస్త్రాలను తనిఖీ చేయడంతో పాటు స్వాధీనం చేసుకున్నామని భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచడం దారణమని ఇఒ మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.

Tags

Next Story