కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం నైజం కాదు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka
X

Bhatti Vikramarka

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడే నైజం కాదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌పై స్పందిస్తూ పారదర్శక పాలన అందించడమే ప్రధాన లక్షమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసేలో కక్ష అనుకుంటే అది వారి ఆలోచనే అని, ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని డిప్యూటీ సిఎం స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత జీవితాలపై చేసే ఎలా అని ప్రశ్నించారు. కేసు విచారణ జరిగే ప్రక్రియపై కామెంట్ చేస్తే ప్రభావం చేసినట్టు అవుతుందని, విచారణ గురించి మాట్లాడడని తెలిపారు. విచారణ ఎవరి ఇష్టానుసారం జరగదని డిప్యూటీ సిఎం తేల్చి చెప్పారు.

Tags

Next Story