రాష్ట్రంపై సీతకన్ను

రాష్ట్రంపై సీతకన్ను
X

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వి కసిత్ భారత్ లక్షానికి అనుగుణంగా రాష్ట్రం సహకరిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్ని రంగాల్లో మొండి చేయి చూ పారని రాష్ట్ర డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ప్రజాభవన్‌లో విలేఖరుల స మావేశంలో డిప్యూటీ సిఎం మాట్లాడారు. కేంద్రం ప్రవేశ పెట్టిన రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌లో రాష్ట్రం కోసం ఏదైనా ఉంటుంది అని ఆశ పడ్డామ ని ఎటువంటి కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి, ఎంపిలు పలు మార్లు ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను గుర్తించి నిధులు ఇస్తారనుకుంటే ఏమీ ఇ వ్వలేదన్నారు. పది వేల కోట్లతో వచ్చే ఐదు సంవత్సరాల్లో కేంద్రం బయోఫార్మా అభివృధ్దిపై ఫోకస్ చేసిందని, దాంట్లో అయినా రాష్ట్రం గుర్తు రాలేదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఎకో సిస్టమ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని,

కెమికల్ పార్క్ లకు హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉందని అందులో సైతం కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో స్పోర్ట్‌ని అభివృద్ధి చేసేందుకు విజన్ డ్యాక్యూమెంట్‌లో ప్రణాళికలు సిద్దం చేశామని, స్పోర్ట్ యూనివర్శిటీ పెట్టామని వీటి అభివృద్ధికి కూడా కేంద్ర సహకరించలేదన్నారు. ఆడియో, వీడియో, కామిక్స్, గేమింగ్స్ లాంటి ఆరెంజ్ ఎకానమీకి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ ఏం తప్పు చేసిందని దాన్ని కూడా బాంబేకు తరలించారని డిప్యూటీ సిఎం ప్రశ్నించారు. ప్రపంచానికి కోవిడ్‌లో వ్యాక్సీన్ అందించిన హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉందని, రీజినల్ మెడికల్ హబ్ అంటూ బడ్జెట్‌లో చెప్పిన కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని భట్టి తెలియజేశారు. మూసి ప్రక్షాళన ఊసే లేదని, యెనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, మున్నూరు, కవ్వాల్ టైగర్ ఫారెస్ట్, కృష్ణా, గోదావరి మధ్య పచ్చని వాటర్ ఫాల్స్, లాంటి పర్యటక ప్రాంతాలను పట్టించుకోలేదని, ప్రపంచం గుర్తించినా, నిధులు విషయంలో కేంద్రం మాత్రం చిన్న చూపు చూసిందన్నారు. సమ్మక్క సారక్క దర్శనానికి న్యూజిలాండ్ ట్రైబ్స్ వచ్చిన విషయాన్ని డిప్యూటీ సిఎం గుర్తు చేశారు.

సెమీ కండక్టర్‌ల తయారీ నేడు ప్రంపచానికి అవసరమయిన రంగమని హైదరాబాద్ లాంటి ఎకో సిస్టమ్ ఉన్న రాష్ట్రానికి సెమీకండక్టర్ల తయరీకి చేయూత ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం ఎస్సి, ఎస్టి, మైనార్టీ, ఇతర సంక్షేమం గురించి ఆలోచనే లేదని, ఉపాధి హామీ పథకాలనికి పేరు మార్పుతో పాటు, బడ్జెట్‌లో కూడా తూట్లు పొడిచారని భట్టి ధ్వజమెత్తారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎర్త్ మినరల్స్ అని రాష్ట్రంలోని సత్తుపల్లి, రామగుండం, సింగణి లాంటి ప్రాంతాల్లో విలువయిన లిథియం, స్కాండియం లాంటి మినరల్స్ ఉన్నాయని వాటి కోసం రాష్ట్రానికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఫిజికల్ డెఫిషిట్ లో రాష్ట్రానికి నాలుగు శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, కేంద్రం మాత్రం 4.3 శాతం ఫిజికల్ డెఫిషిట్ పెట్టుకుందని, రాష్ట్రానికి మాత్రం అనుమతి ఇవ్వలేదని, తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ బడ్జెట్ సెషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి నిధులు కేటాయించాలని వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు.

Tags

Next Story