'భోగీ' ట్రైలర్ వచ్చేసింది.. శర్వానంద్ విశ్వరూపం

భోగీ ట్రైలర్ వచ్చేసింది.. శర్వానంద్ విశ్వరూపం
X

శర్వానంద్ హీరోగా సంపత్ నందీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్, డింపు హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యాన్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్, టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మాస్ అవతార్ లో శర్వానంద్ విశ్వరూపం చూపించబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తుంటేనే అర్థమవుతోంది. యాక్షన్ తోపాటు అన్నాచెల్లెల్ల అనుబంధం, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను రూపొందించారు. కాగా, నవంబర్ 27న ‘భోగి’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.




Tags

Next Story