నేటి నుంచి ఐదు మండలాల్లో భూభారతి

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో భూ వి వాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమై న, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొ డుగు కిందకు తెస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్‌ను రూపొందించామని ఆయన తెలిపా రు. ఈ పోర్టల్‌ను గురువారం (2వ తేదీ) నుం చి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగు అని ఆ యన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బ ట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్‌లో ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను రైతు కోణంలో రూపొందించామని, సామా న్య రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఖ మ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గ ల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జి ల్లా కొస్గీ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.గతం లో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్‌ను రూపొందించామని మంత్రి తెలిపారు. రై తులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే ’భూ భారతి’ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తమకున్న భూమి వివరాలు కనిపిస్తాయని మంత్రి తెలిపారు.
ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే, అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంద న్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెనస్డ్ సర్వేయర్ లాగిన్‌కు వెళతాయన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారన్నారు. అనంతరం ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెనస్డ్ సర్వేయర్ ఖరారు చేయడమే కాకుండా, సర్వేను రోవర్లతో పూర్తి చేస్తారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిని సిస్టంలో నమోదు చేశాక, అది మండల సర్వేయర్ స్క్రూటినీకి వెళుతుందన్నారు. ఆపై మండల తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్లు కేటాయిస్తారని ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ భూ భారతి పోర్టల్‌లో నిక్షిప్తమవుతాయన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్‌ను జనరేట్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ అలర్ట్ వస్తాయని మంత్రి వివరించారు.
భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా....
భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్‌ను (ఎల్పీఎం) యూనిక్ నంబర్, ప్రతి సర్వే నంబర్‌కు భూధార్ నంబర్ కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ జరింగ్ వంటి పాత పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి కావడమే కాకుండా, కచ్చితమైన వివరాలు వస్తాయన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని మంత్రి స్పష్టం చేశారు.
-
Home
-
Menu
