అదుపుతప్పిన బైక్... బస్సు ఢీ: యువతి మృతి

అదుపుతప్పిన బైక్... బస్సు ఢీ: యువతి మృతి
X

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో యువతి దుర్మరణం చెందింది. బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో వెనుక కూర్చున్న యువతిపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. హైదరాబాద్ నుంచి జెపి దర్గాకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story