బయోకాన్‌లో బయోలాజిక్స్ విలీనం

బయోకాన్‌లో బయోలాజిక్స్ విలీనం
X

న్యూఢిల్లీ : బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ బయోలాజిక్స్ యూనిట్ బయోకాన్‌లో విలీనం కానుంది. దాని విలువ 5.5 బిలియన్ డాలర్లు. బయోకాన్ బయోలాజిక్‌ను తనతో పూర్తిగా అనుసంధానించనున్నట్లు బయోకాన్ శనివారం తెలిపింది. బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ లో మిగిలిన వాటాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆప్ లైఫ్ సైన్సెస్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్2 మరియు యాక్టీవ్ పైన్ ఎల్‌ఎల్‌పిల నుండి వాటా స్వాపింగ్ ద్వారా కొనుగోలు చేస్తుంది. దీని విలువ 5.5 బిలియన్ డాలర్లు అని బెంగళూరుకు చెందిన కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ప్రతి 100 బయోకాన్ బయోలాజిక్స్ షేర్లకు 70.28 బయోకాన్ షేర్ల చొప్పున, ప్రతి బయోకాన్ షేర్‌కు 405.78 రూపాయల చొప్పున షేర్-స్వాప్ నిష్పత్తి నిర్ణయించారు. ఇంకా, బయోకాన్ మైలాన్ ఇంక్ (వయాట్రిస్) కలిగి ఉన్న మిగిలిన వాటాను మొత్తం 815 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తుంది, ఇందులో 400 మిలియన్ డాలర్లు నగదు రూపంలో మరియు 415 మిలియన్ డాలర్లు షేర్ స్వాప్ ద్వారా చెల్లించనున్నట్లు వెల్లడించింది.

Tags

Next Story