వెండితెరపైకి మరో ఆధ్యాత్మిక గురువు బయోపిక్

వెండితెరపైకి మరో ఆధ్యాత్మిక గురువు బయోపిక్
X

నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో వచ్చిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.366 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మరో ఆధ్యాత్మిక గురువు జీవితం వెండితెరపైకి రాబోతుంది. 15-16వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త, కవి, ఉత్తర భారతంలో భక్తి ఉద్యమానికి సారథ్యం వహించిన సంత్ గురు రవిదాజ్‌జీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ‘మహాకావ్య శ్రీరామాయణ కథ’ సినిమాను నిర్మించిన సంస్థ ఈ బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీనికి ‘రైదాస్-ఏక్ విచార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రధాన పాత్ర పోషించే నటుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.



Tags

Next Story