బైటాట్ స్పాట్ వచ్చిందంటే కళ్లకు ఏమవుతుంది?

X
తెల్లగా నురగలా వెన్నెలా ఉన్న ఓ చిన్న ముద్దలా కంట్లో ఇలా తెల్లగుడ్డు పైన మీ పిల్లల కంట్లో కనపడితే అది బైటాట్ స్పాట్ అని అంటారు. ఇది విటమిన్ ఎ తక్కువ కావడంతో వస్తుంది. వైద్యం ఇవ్వకపోతే కాలక్రమంలో రేచీకటి కూడా రావచ్చు. తరువాత జిరాఫ్తాల్మియా, కార్నియల్ అల్సర్లు వచ్చి గుడ్డివారు కావచ్చు. ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్లు వచ్చి ప్రాణాపాయము కలగవచ్చు.
మీరేం చేయాలి?
హైడోసు విటమిన్ సప్లిమెంట్స్ తో వెంటనే వైద్యం మొదలు పెట్టాలి. ఆహారంలో ఆకుకూరలు, క్యారెట్లు స్వీట్ పొటాటో దుంపలు లాంటివి తినాలి. కోడి గుడ్డులోని పచ్చ సొన, చేప లాంటి వాటిలో కూడా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఫిష్ లివర్ ఆయిల్ కాడ్ లివర్ ఆయిల్ లాంటివి కూడా మనకు దొరుకుతాయి.
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Tags
Next Story
-
Home
-
Menu
