గ్లోబల్ కాదు గోల్-మాల్ సమ్మిట్ :బిజెపి ఎంఎల్ఎ రాకేష్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్&గోల్ మాల్ సమ్మిట్‌లా ఉంది. అని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. సమ్మిట్‌కు ఎంఎల్‌ఏలను ఆహ్వానించి అవమానించారని ఆయన విమర్శించారు. తాను వెళ్ళానని, అక్కడ ఎంఎల్‌ఏలను పట్టించుకునే నాధుడే లేరని ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఎంఎల్‌ఏలు కూర్చునేందుకు కనీసం కుర్చీలు లేవని ఆయన విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్‌లా లేదని, రియల్ ఎస్టేట్ బ్రోచర్ విడుదల చేసే కార్యక్రమంలా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రెండు వందల ఏళ్ళ తర్వాత జరిగే అభివృద్ధి ఎవరికి అవసరమని ఆయన ప్రశ్నించారు. ముందు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసీలు, లంబాడిలు నివసించే తండాల్లో తాగు నీరు, రవాణా సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఎల్‌ఏ రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
Home
-
Menu
