కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌వి అవినీతి పరిపాలనలు: రామచంద్రరావు

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌వి అవినీతి పరిపాలనలు: రామచంద్రరావు
X

ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్, గతంలో పాలిచంన బిఆర్‌ఎస్‌లు కంట్రాక్టర్లకు దోచిపెట్టి అవినీతి పాలన అందిచినవని రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. గురువారం రాబోయే మన్సిపల్ ఎన్నికల సందర్బంగా భూపాలపల్లిలో ఆయన పర్యటించగా ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన ప్రసంగించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవినీతి రహిత సమాజం పాలన అందిస్తుందని అన్నారు. గ్రామా అభివృద్ధికి అనేక పథకాలు అందిస్తుందని అన్నారు. వరంగల్ ఉమ్మిడి జిల్లా అభివృద్దికోసం రూ.2 వేల కోట్ల నిధులు ఖర్చు చేసిందని అన్నారు.కేంద్రం రైతులకు యూరియా అందిస్తే కాంగ్రెస్ నాయకులు దాచి పెట్టుకొని దళారి వ్యవస్త సృష్టించి యూరియా అందించక రైతులను ఇబ్బందికి గురిచేశారని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలురాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఉద్యోగులకు జీతాలు, రైతులకు రైతు బందు ఇవ్వలేక పోతుందని అన్నారు. రేవంతరెడ్డి సర్కారు విశ్వవిద్యాలయాల భూములు అమ్మకొని అవినీతికి పాల్పడుతున్నారిని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను బిఆర్‌ఎస్ దోచుకుందని, కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తుందని అన్నారు. పంచాయితీలకు రూ.3వేల కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఒక్క సారి బిజెపి అవకాశమిస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదని అన్నారు. సర్పంచి ఎన్నికల్లో బిజెపి మెరగైన సీట్లు సాదించామని అన్నారు. ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తుంనది అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలో బిజెపిని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిషిదర్‌రెడ్డి, రాజమౌళిగౌడ్, పాపయ్య, చల్ల నారాయణరెడ్డి, దర్మరావు, కన్నం యుగేందర్ నాయకులు పాల్గొన్నారు.

Tags

Next Story