నారాయణపేట మున్సిపాలిటీ లో వికసించిన కమలం

నారాయణపేట పట్టణం బిజెపికి కంచు కోట అని మరోమారు రుజువైంది. పట్టణంలోని 24 వార్డులలో బిజెపి 11 వార్డుల్లో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ 07, టిఆర్‌ఎస్ 02, ఎంఐఎం 02, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 01, స్వతంత్ర 01 స్థానాలు సొంతమైంది. జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద కౌంటింగ్ నిర్వహించగా ఉదయం నుంచి వార్డుల నుంచి కౌన్సిలర్ అభ్యర్థుల అభిమానులు తరలివచ్చారు. మొత్తం మూడు రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
గెలిచిన అత్తకోడళ్ళు...
పేట మున్సిపల్ ఎన్నికల్లో రెండు వేరు వేరు పార్టీలకు చెందిన అత్తకొడల్లు మొదటి సారి కౌన్సిలర్ గా విజయం సాధించారు. 17వ వార్డు నుంచి కర్రే కల్పన బిజెపి నుంచి కౌన్సిలర్ గా గెలుపొందగా ఈమెకు కోడలు వరుస అయిన 20వ వార్డు అభ్యర్థి శ్వేత కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందింది. అలాగే గతంలో పేట మున్సిపల్ ఎన్నికల్లో గతంలో వైస్ చైర్మన్ గా పనిచేసిన ఇద్దరు అభ్యర్థులు హరి నారాయణ భట్టాడ్, నందునామాజీలు ఓటమి చెందారు. అలాగే కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్న 5 వ వార్డులో బిజెపి అభ్యర్థి ఎరుకలి రఘు విజయం సాధించారు. ఇదిలా ఉండగా 20 వ వార్డు కు సంబంధిన బీజేపీ అభ్యర్థులు 17 వ వార్డు లో కల్పన, 6 వ వార్డు లో మంజుల, 4 వార్డు లో శ్వేత గెలుపొందారు. కానీ ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్వేత వెంకటేష్ గౌడ్ గెలుపొందడం విశేషం. 1 సుతారి సత్య రఘుపాల్ (బీజేపీ),
2 కె.సౌజన్య (బీజేపీ), 3 కాకర్ల నారాయణమ్మ (బీఆర్‌ఎస్), 4 కొండా శ్వేతా సత్య యాదవ్ (బీజేపీ), 5 ఎరుకలి రాఘవేంద్ర (బీజేపీ), 6 ఎన్. మంజుల (బీజేపీ),7 భరత్ (బీ ఆర్ ఎస్), 8 కందేన్ పల్లి సత్యమ్మ(కాంగ్రెస్), 9 యు. మహేష్ (కాంగ్రెస్), 10 జయశ్రీ (స్వతంత్ర), 11 భగవతి (ఏ ఐ ఎఫ్ బీ), 12 అప్పిరెడ్డి పల్లి రాము (బీజేపీ), 13 లక్మప్ప (బీజేపీ), 14 ఎల్. అరుణ (కాంగ్రెస్), 15 బండి రాజేశ్వరి (కాంగ్రెస్), 16 అంబికా శ్రీనివాస్ (బీజేపీ), 17 కర్రే కల్పన (బీజేపీ), 18 రవితేజ (కాంగ్రెస్), 19 బి. నాగమ్మ (బీజేపీ), 20 శ్వేత (కాంగ్రెస్), 21 కమలాపూర్ ప్రభాకర్ (బీజేపీ), 22 రాజు ఘాట్ (కాంగ్రెస్), 23 మహమ్మద్ తాకిచాంద్ (ఏఐఎంఐఎం), 24 మహమ్మద్ తకీ (ఏఐఎంఐఎం) లు ఆయా వార్డు లలో గెలుపొందారు.
-
Home
-
Menu
