బిఎండబ్ల్యూ టెండర్ రద్దు.. లోక్‌పాల్ వెనుకడుగు

X
న్యూఢిల్లీ ః వివాదాస్పదంగా మారిన ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోళ్ల టెండరును అవినీతి నిరోధక వ్యవస్థ లోక్‌పాల్ రద్దు చేసింది. లోక్‌పాల్ కోసం మొత్తం రూ 8 కోట్ల విలువ చేసే విలాసవంత కార్ల సేకరణకు ఇందుకు ముందు టెండర్లు పిలిచారు. రెండు నెలల కిందటి ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వెనకకు తీసుకున్నారని అధికారులు తెలిపారు. అత్యంత ఖరీదైన కార్ల కొనుగోళ్ల నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు, సభ్య సమాజ కార్యకర్తలు, సోషల్ మీడియాలలో తీవ్రస్థాయి విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే లోక్‌పాల్ వీటి సేకరణ నిర్ణయం వెనుకకు తీసుకుంది. లోక్‌పాల్ పూర్తి స్థాయి ధర్మాసనం సమావేశం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొనుగోళ్లకు సంబంధించి అక్టోబర్ 16వ తేదీన వెలువరించిన టెండర్ జారీని నిలిపివేశారు. ఈ మేరకు డిసెంబర్ 16వ తేదీన సవరణ ప్రకటన వెలువడిందని లోక్‌పాల్ వర్గాలు ఇప్పుడు తెలిపాయి.
Tags
Next Story
-
Home
-
Menu
