ఆటో కిందపడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఆటో కిందపడి ఏడాదిన్నర చిన్నారి మృతి
X

బోధన్: సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆటోలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చిన బోధన్‌కు చెందిన వ్యాపారి అబ్ధుల్ ఖాదర్ వద్దకు తల్లి అయేషా బేగం వెళ్లింది. ఆమె వెనకే చిన్నారి కూడా పాకుతూ బయటకు వచ్చింది. ఉల్లిగడ్డల బేరం కుదరకపోవడంతో తల్లి పక్కకు వచ్చింది. చిన్నారిని గమనించని ఖాదర్ ఆటోని ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆటో టైరు పాప తలపై నుంచి వెళ్లింది. పాపకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకూ కళ్లముందే ఆడిన పసి పాప విగత జీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతి చెందిన చిన్నారి సాలంపాడ్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, అయేషాబేగం దంపతులకు మూడో సంతానం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై తెలిపారు.

Tags

Next Story