పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం

పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం
X

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బొగత జలపాతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర ఉధృతితో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలపాతం నిండుకుండలా మారి ఉగ్రరూపం దాల్చింది. పచ్చని అటవీ అందాల నడుమ కొండకోనల నుంచి నురగలు కక్కుతూ ఐరావతాన్ని తలపించేలా పడుతున్న జలధారలు చూపరులను విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. భారీ ప్రవాహం కారణంగా, వరద నీరు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అటవీశాఖ మరియు పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకులు ఎవరూ నీటిలోకి దిగవద్దని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.తెలంగాణలోనే రెండో అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన ఈ ’తెలంగాణ నయాగరా’ అందాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Tags

Next Story