రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్తూ ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్తూ ఇద్దరు మృతి
X

పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొంతమంది బొలెరో వాహనంలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ వద్ద బొలెరో వాహనం వెనుక టైర్ పేలడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story