కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటుబాంబుల కలకలం..

కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటుబాంబుల కలకలం..
X

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రైల్వే స్టేషన్‌లో ట్రాక్ అనుమానాస్పదంగా పడి ఉన్న సంచుల్లోని నాటుబాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వీధి కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. పేలుడు ధాటికి రైల్వే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేల్వే పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. స్టేషన్ లోని ట్రాక్ పై పడి ఉన్న బ్యాగ్‌లో ఐదు పేలని బాంబులను పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున స్టేషన్ నుండి బయలుదేరే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో ఎవరో బాంబులను తీసుకెళ్లడానికి ప్రయత్నించారని, తనిఖీలకు భయపడి బ్యాగ్‌ను పట్టాలపై వదిలివేసి ఉండవచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్ ప్రకటించారు.

Tags

Next Story