లోక్‌భవన్‌తో పాటు సిఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు

రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ), లోక్ భవన్‌లను పేల్చడానికి కుట్ర జరుగుతోందని పేర్కొంటూ అగంతకుడు లోక్ భవన్ కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. ’వాసుకి ఖాన్’ అనే పేరుతో వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌లో వెంటనే విఐపిలను, ప్రముఖులను ఆ భవనాల నుంచి ఖాళీ చేయించాలని బెది రించినట్లు సమాచారం. ఈ మెయిల్ అందిన వెంటనే గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది. గవర్నర్ కార్యాలయ సిఎస్‌ఒ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్కాడ్‌తో సీఎంవో, లోక్ భవన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే, బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పంపారు అనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.
-
Home
-
Menu
