రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
X

చెన్నై: తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సూపర్‌‌‌స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

అక్టోబర్ 3వ తేదీన తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, నటి త్రిష నివాసాలతో పాటు బిజెపి ప్రధాన కార్యాలయం, డిజిపి ఆఫీసు, రాజ్‌భవన్‌కి బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 13వ తేదీన మరోసారి స్టాలిన్, రజనీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Tags

Next Story