శంషాబాద్ విమానాశ్రయంలో మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

X
Shamshabad airport
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే అధికారులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా దింపి ఐసోలేషన్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
