బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా నదిలో పడి యువకుడు మృతి

బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా నదిలో పడి యువకుడు మృతి
X

బాసర: నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రమావత్ సాయికిరణ్ (25) గోదావరి నదిలో పడి చనిపోయాడు. యూకెలో ఎంబిఎ చేస్తున్న అతడు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి యుకె వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం బాసర ఆలయానికి సాయికిరణ్ వెళ్లాడు. దర్శనం అనంతరం బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా.. బుధవారం అతడి మృతదేహం లభ్యమైంది. తండ్రి రమావత్ భోజారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story