పుష్కరిణిలో పడి బాలుడు మృతి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ కింద గల పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందాడు. ఆలయ ఇఒ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు సంతోష్ (8) పుష్కరిణిలోకి దిగినప్పుడు నీటి చల్లదనానికి ఫిట్స్ రావడంతో నీళ్లలో మునిగి మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారమిచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల పంచనామా అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఉండి వ్యర్థపదార్ధాలు ఏరుకునే వారి కుమారుడిగా గుర్తించినట్లు తెలిపారు.
సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి..
పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందడంతో సంప్రోక్షణ నిర్వహించారు. పుష్కరిణిలోని నీటిని మొత్తం ఖాళీ చేసి ఆలయ అర్చకులతో శుద్ధిచేసి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం మళ్లీ నీళ్లు నింపి భక్తులకు అనుమతించారు.
-
Home
-
Menu
