కోతుల భయంతో ఆగిన చిన్నారి

కోతుల భయంతో ఆగిన చిన్నారి
X

కోతులు తరమడంతో ఓ బాలుడి గుండె ఆగిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాభపురంలో జరిగింది. వల్లాభాపురం గ్రామానికి చెందిన నిషాంత్ (12) అదే గ్రా మానికి చెందిన మణేందర్ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. మార్గమధ్యంలో ఒ క్కసారిగా కోతులు గుంపు వీరిపైకి దూసుకొచ్చింది. కోతులు వెంటపడటంతో భయాందోళనకు గురైన ఇద్దరు బాలురు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో నిషాంత్ కింద పడి పోగా, కొంత దూరంలో మణేందర్ గట్టిగా కేకలు వేశాడు. బాలుడి అరుపులకు కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

అనంతరం మణేందర్ వెనక్కి తిరిగి చూడగా నిషాంత్ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. వెంటనే నిషాంత్‌ను బైక్‌పై స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే నిషాంత్ మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనలో వల్లాభాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story