ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

X
జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని కార్తీక్ (4) అనే బాలుడు మృతి చెందాడు. శనివారం ఎస్‌ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని బిసి కాలనీలో ఆ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ వెనకాలకు రివర్స్ తీసుకుంటుండగా ట్రాక్టర్ ట్రాలీ ఆ బాలుడి తలకు బలంగా తగిలి, గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న తమ కుమారుడి అకాలమృతితో తల్లిదండ్రులు, బంధువులు విలవిల్లాడారు. మృతుడి తండ్రి విష్ణు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story
-
Home
-
Menu
