బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి

బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి
X

వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివారాల ప్రకారం.. మండల కేంద్రలోని దేవీనగర్ ప్రాంతానికి చెంది న లక్ష్మణ్, గాయత్రి దంపతుల కుమారుడు ఆర్యవర్ధన్(9 నెలలు). ఈ నెల 12న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ వాటర్ బాటిల్‌ను నోట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బాటిల్ మూత గొంతులో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతుండగా.. కుటుంబ సభ్యులు చేతివేళ్లతో తీశారు. మూత తీసే క్రమంలో బాలుడి గొంతులో గాయం కావడంతో మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొండుతూ బుధవారం మృ తి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెం దడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Tags

Next Story